దత్తన్న వ్యాఖ్యలు…ఆ పార్టీల్లో దుమారం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 13: బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు, ఇతర పెద్ద నేతలు త్వరలో తమ పార్టీ బిజెపిలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కవిత, వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం ఆరంభమైందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియేనని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడు డీఎస్ తో పాటు చాలా మంది కీలక నేతలు త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో అలజడి, కలవరం మొదలైంది. దత్తన్న తాజా వ్యాఖ్యలు అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ నేతలెవరంటూ ఇరు పార్టీల నేతలను కలవరానికి గురిచేస్తోంది. మొత్తానికి దత్తాత్రేయ వ్యాఖ్యలు తెలంగాణా లో రాజకీయ ప్రకంపనలకు తెరలేపాయి.