JMS News Today

For Complete News

ఇదేమి పాలన.. ఎమ్మెల్యే పైనే దాడా.. ?

1 min read

హైదరాబాద్‌: హైదరాబాద్ లోని జుమ్మెరాత్ బజార్ లో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని పునర్ నిర్మించేందుకు ఓ వర్గం ప్రయత్నించడం, ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం లాంటి పరిణామాలతో వారు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా విగ్రహన్ని పునర్‌ నిర్మించవద్దని పోలీసులు అడ్డుకకోవడం ..ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం లాంటి పరిణామాలతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే, ఈ లాఠీ ఛార్జిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. రాజాసింగ్ ను వెంటనే పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అన్యాయంగా  దాడి చేశారని, దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే దాడి చేస్తారా అని పోలీసులపై రాజాసింగ్ మండిపడ్డారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఓ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమానుషమని లక్ష్మణ్  మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధిని రక్తం వచ్చేలా కొట్టడం ఏమిటని ? తెలంగాణలో ప్రజాపాలన ఉందా? రజాకార్ల పాలన కొనసాగుతోందా? అని లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *