డెబ్భైఏళ్ళుగా అదే మోసం..అదే వంచన
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 23: కాంగ్రెస్ పార్టీ అధినేతలు పేరు చివరన గాంధీ పేరు టోపీ ధరించి గత 70 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ వస్తున్నారని, అదే విషయాన్ని జమ్మికుంటలో సంకల్ప యాత్రను అడ్డుకుని మోసం వంచన మరోసారి నిరూపించుకున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ ఒక ప్రకటనలో ఆరోపించారు. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆచరణ పట్ల ఆ నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమైందని, భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఊరికి కోసం ఏమి చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. గాంధీజీ సంకల్ప యాత్రను ఎందుకు అడ్డుకుందో ఏ స్థాయి నాయకుడీ ఆదేశాలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికంగా రాజకీయ ఉనికి కాపాడుకోవాలన్న తపనలో పార్టీ సైద్ధాంతిక ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహా నాయకుల సిద్ధాంతాల ఆచరణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అదే స్థాయిలో ప్రతి దాడులకు సైతం బిజెపి నాయకత్వం శ్రేణులు సిద్ధంగా ఉంటారని కొట్టె మురళీకృష్ణ హెచ్చరించారు