ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 30: రాష్ట్ర ప్రజలందరిని సమానంగా చూడాల్సిన బాధ్యతను మర్చిపోయినా కేసీఆర్ కు సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదని బిజెపి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుల, మత వర్గాలకతీతంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానని పమాణం చేసిన కేసీఆర్ ఇప్పుడు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. చింతమడక ప్రజలకు ఇంటికీ 10 లక్షల రూపాయలను ఇవ్వడానికి సిద్దపడ్డటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను తొలగించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఇకపోతే పరిపాలన ప్రగతి భవన్ కే పరిమితమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపియేనని అన్నారు. రాష్ట్రంలో కరువు నెలకొందని, రైతులకు వాన కల పంటలు వేసుకునే సమయం లేకుండా పోయిందని తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన సూచనలు సరైన సమయంలో ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కన్నబోయిన ఓదెలు, రాష్ట్ర నాయకులు మారుతి, హరి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.