JMS News Today

For Complete News

ఆ డబ్బుతో గెలవాలని కేసీఆర్ ఆలోచన

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 11: కరీంనగర్ ను లండన్ చేస్తా అని సీఎం చెప్పారు. అయిందా? అంటూ బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ ప్రశ్నించారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు ఏమైంది? అంటూ దుయ్యబట్టారు. ఇవాళ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడారు. మెగా కృష్ణారెడ్డి కోసమే మిషన్ భగీరథ పథకమని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్లు పొందారని, కమిషన్లు సంపాదించి ఎన్నికల్లో అదే డబ్బుతో గెలవాలన్నది కేసీఆర్ ఆలోచన అంటూ విమర్శించారు. కరీంనగర్ మున్సిపాలిటీకి నిధులిస్తామని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 14వ ఫైనాన్స్ నిధులు, కేంద్ర నిధులు తప్ప రాష్ట్రం ఇచ్చింది ఏమీ లేదని ఆరోపించారు. స్మార్ట్ సిటీ కింద కేంద్రం కరీంనగర్ కు అధిక నిధులిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్ రూం ఇళ్లకు కూడా నిధులొచ్చాయని చెప్పారు. నరేంద్ర మోడీ ఫొటో పెట్టాల్సి వస్తోందనే ఇళ్లు ప్రారంభించడం లేదని, ఆయుస్మాన్ భవ ద్వారా 5 లక్షల వరకు పొందే అవకాశమున్నా మోడీకి పేరు వస్తుందని అమలు చేయడం లేదని ఆరోపించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగానే ఫెయిలయ్యారని, ఆయన ముఖ్యమంత్రి అవుతారట అంటూ ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం మరింత వెనక్కు పోతుందని అన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 సీట్లు ఓడిపోయిందని తెలిపారు. తుగ్లక్ లాగా ఎర్రమంజిల్ కూలగొడతానంటున్నాడని, రాత్రి ఆలోచన వస్తే పొద్దున సెక్రటేరియట్ కూల్చేస్తానంటాడని ఎద్దేవా చేశారు. రాష్రమమేమో గానీ కల్వకుంట్ల కుటుంబం బంగారం అయిందని విమర్శించారు.
మా కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారని ఉద్యమ సమయంలో చెప్పి ఇప్పుడు మాట తప్పాడని, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పడమే కాకుండా రెండోసారి కొడుకు ను మళ్లీ సీఎం చేయాలనుకుంటున్నాడని విమర్శించారు. సీఎం దళిత ద్రోహీ అని,
25 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నారని, మరో 25 మంది సమ్మె సమయంలో బస్సు ప్రమాదాల్లో చనిపోయారని అన్నారు. ఓడిపోయిన వినోద్ కు ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చేసారని, టీటీడీలో ముగ్గురు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని, కవితను రాజ్యసభకు పంపుతాడట అంటూ
ఇవన్నీ ఎన్నికల్లో ప్రజలకు చెబుతామని తెలిపారు. సీఏఏ విషయంలో సీఎం ఎందుకు మజ్లిస్ కు మద్ధతునిస్తున్నాడో అర్థం కావడం లేదని, సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. ఎన్.పి.ఆర్ లో వివాదస్పద వివరాలున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నార్సీ 1950లోనే వచ్చిందని, ఇది కొత్తదేం కాదని తెలిపారు. అస్సాంలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే ఎన్నార్సీ అమలవుతోందని, ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారని, అన్ని ముస్లిం దేశాల్లోనూ ఇలాంటి చట్టాలున్నాయని అన్నారు. అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకు సీఏఏ అవసరమని చెప్పారు. బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, హుజూర్ నగర్ లో ఓటుకు 5 వేలు కట్టి టీఆర్ఎస్ గెలిచిందని, డబ్బులకు ఆశపడి ప్రజలు ఓటును అమ్ముకోవద్దని కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *