కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 2: గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంతిమయాత్రలో ఎంపీ బండి సంజయ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నగరంలోని తెలంగాణ చౌక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం, సీఎం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాస సత్యనారాయణ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫాసిస్టు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఎంపీపై దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ మేయర్ డి.శంకర్, బీజేపీ నగర ప్రధాన కార్యదర్శులు బండ రమణారెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ తో పాటు పార్టీ సీనియర్ లు మాసం గణేశ్, దుర్శెటి సంపత్, అవుదుర్తి శ్రీనివాస్, గుర్రం పద్మ, యెన్నెం శ్రీనివాస్, చిట్టిబాబు, గాజె రమేశ్, యెన్నెం ప్రకాశ్, తనుకు సాయి, శ్రవణ్, జాడి బాల్ రెడ్డి, ఎండీ ముజీబ్, పాదం శ్రీనివాస్, తోట సాగర్, దుర్శెటి అనుప్, కచ్చు రవి, పొన్నం రవి, మహిళా నేతలు సుజాత రెడ్డి, బండ అనిత, మాధవి, పుష్ప విజయ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.