బిజెపి మండల అధ్యక్షుడిపై దాడి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కాటారం, సెప్టెంబర్ 18: భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాటారం మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
కాటారం మండల బిజెపి అధ్యక్షుడు దుర్గం తిరుపతిపై బుధవారం రాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న తిరుపతిపై కత్తులతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే మహదేవ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి పరిస్థితి ఈ విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.