అతిపెద్ద పార్టీ బిజెపి…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 4: బీజేపీ సభ్యత్వ నమోదు ద్వారానే నవభారత నిర్మాణానికి నాంది అని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. ప్రపంచలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ గా భాజపా ఆవిర్భావించిందని తెలిపారు. ఆదివారం నగరంలో 32వ డివిజన్ లో పొన్నం మొండయ్య గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, కటకం లోకేష్, రాపర్తి విజయ, గాజుల స్వప్న, బండ అనిత, సుజాత రెడ్డి లతో పాటు పలువురు పాల్గొన్నారు.