వారణాసిలో మోడి, హైదరాబాద్ లో అమిత్ షా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 6: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యత్వం నమోదు కార్యక్రమం ఆ పార్టీ నేతలు శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడి, హైదరాబాద్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్షా తొలిసారిగా శనివారం నగరానికి వస్తున్నారు. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. అమిత్షా సమక్షంలో పలువురు పార్టీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇందుకోసం ఆయా పార్టీల్లో అసమ్మతి నేతలు, తటస్థులతో బీజేపీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. శనివారం శంషాబాద్లో జరిగే పార్టీ రాష్ట్ర స్థాయి నేతల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. దీని కంటే ముందు ఆయన సరూర్నగర్ మండలం మామిడిపల్లి రంగనాయకతండాలోని గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబానికి పార్టీ సభ్యత్వం అందజేస్తారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో కలిసి ‘ఛాయ్’ తాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒక మాజీ ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది. ఇక నేటిి నుంచి తెెెెలంగాణ వ్యాప్తంగా బిజెపి పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో ఆ పార్టీీ లో సందడి నెెలకొననుంది.