JMS News Today

For Complete News

కేసీఆర్ సర్కార్ పై బిజెపి ఎంపీల ఫైర్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

న్యూ ఢిల్లీ, జూలై 17: నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బుధవారం డిల్లీ లో మీడియాతో మాట్లాడారు. స్వామీజీలు చెప్పారని ప్రభుత్వ బిల్డింగులను సీఎం కేసీఆర్ కూలగొట్టడం సరికాదని నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రివ్యూ చేసే అవకాశం లేకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ చూస్తుతున్నారని చెప్పారు. కేసీఆర్ కు దమ్మూ, ధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలని అన్నారు. బీజేపీని సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్తున్న కేసీఆర్…మరోవైపు బీజేపీ, మోడీ పేర్లు వింటేనే వణికిపోతున్నారని ఏద్దెవా చేశారు. కూతురినే గెలిపించుకోలేని ఆయన భవిష్యత్తులో పార్టీని ఏం గెలిపిస్తారని చెప్పారు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ బలోపేతం అవుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే చాలా మంది అప్లైయ్ చేసుకున్నా, వారికి ఇండ్లను మంజూరు చేయలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి చెప్పే టీఆర్ఎస్ పార్టీ వాళ్లు… అసలు రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *