JMS News Today

For Complete News

సమయం కోసమే వేయిటింగ్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 12: ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపే వరకు నేను నిద్రపోను. సమయం కోసమే వేచి చూస్తున్నా. సరైన సమయంలో ఆధారాలతో సహా తొందర్లోనే బయటపెడతా. అలాగే నీ చాటింగ్ చిట్టా అంతా కూడా నీ సీఎం కేసీఆర్ కు ఇస్తా..కాకపోతే కొందరి జీవితాలు ఆగమైతాయని ఆలోచిస్తున్నా..అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మంత్రి అయ్యాక ఆయన ఏమి మాట్లాడుతుండో ఆయనకే తెలుస్త లేదని, మంత్రి అయ్యాక బాల కాలి వచ్చిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంజయ్  మాట్లాడారు. కరీంనగర్ కే గంగుల కమలాకర్ మంత్రి రాష్ట్రానికి కాదని, ఒక రాష్ట్ర మంత్రిగా కమలాకర్ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలు పర్యటన చేశారో చెప్పాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు స్టార్ట్ చేయమంటే కరీంనగర్ లో ప్రజాప్రతినిధులను కొనడం స్టార్ట్ చేశాడని ధ్వజమెత్తారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ధర్మమే విజయం సాధిస్తుందన్న విశ్వాసం మాకుందని అన్నారు. మొదటి నుండి షోప్ టాప్ మంత్రి గంగుల అని, కేవలం మీడియా కవరేజ్ కోసం మాత్రమే మంత్రి ఆరాటమంటూ ఎద్దేవా చేశారు. నన్ను చూస్తే మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉచ్చ పడుతుంది…ఇక నువ్వెంత నాకు అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపే వరకు బండి సంజయ్ నిద్రపోడని సవాల్ విసిరారు. సరైన సమయంలో ఆధారాలతో సహా తొందర్లోనే బయటపెడతానని తెలిపారు. బండి సంజయ్ ను తిడితే కేసీఆర్ దగ్గర మెప్పు పొందాలనుకునే వ్యక్తి మంత్రి గంగుల,
నావల్ల మంత్రి పదవి వచ్చింది అప్పుడే మర్చిపోయావా గంగుల?? అంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మీ అవినీతి బాగోతం అంతా కక్కిస్తామని అన్నారు. మంత్రి సిఫార్సు లేఖలన్నీ కరీంనగర్ లో బినామీ గనుల కోసం వాడుతున్నాడని ఆరోపించారు. మంత్రి కమలాకర్ నా మీద అనవసరంగా కుక్కలా మొరుగుతూ ఉన్నారని, ఏదోటి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మంత్రి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కరోనా సమయంలో నేను కనిపించలేదంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రికి కళ్ళు దొబ్బయేమో.. ఒకసారి చెక్ చేసుకోవాలంటూ హితవు పలికారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ కు రెండు సార్లు వెళ్లి పరిస్థితిని సమీక్షించా…దీన్ని మంత్రి మర్చిపోయారా..సరే నీవు ఎన్ని ఐసోలేషన్ వార్డులను సందర్శించావో చెప్పాలని మంత్రిని నిలదీశారు.
కరోనా సమయంలో కరీంనగర్ లోని వైద్యులకు, ఉద్యోగులకు భరోసా ఇచ్చింది వాస్తవం కాదా…? అంటూ ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే గా ఉన్న గంగుల కమలాకర్ నియోజకవర్గంలో ఏం పీకాడని, మంత్రి గంగులను విమర్శించే చిల్లర స్థాయి నాది కాదని అన్నారు. కానీ ప్రజలకు చెప్పకపోతే అవే నిజం అనుకుంటారనే ఉద్దేశంతోనే స్పందిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అమలయ్యే ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ సాయం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులో చేయడం లేదని, రాష్ట్ర పరువు కాపాడుకునేందుకు మాత్రమే పరీక్షలు చేయడం లేదని, ఈ విషయంలో రాష్ట్ర, జాతీయ మీడియా గగ్గోలు పెడుతున్నదని తెలిపారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పక్క రాష్ట్రంలో లేవా… అక్కడ ఎందుకు ఎక్కువ టెస్ట్ లు చేస్తున్నారని ప్రశ్నించారు. టెస్ట్ లు చేస్తే కేసులు పెరుగుతాయని, దానితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావనతో వ్యవహరిస్తున్నదని, మీ ప్రతిష్ట కోసం ప్రజల ప్రాణాలను బలి చేస్తారా? అంటూ మండిపడ్డారు. బిజెపి నేతలు డాక్టర్
లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు సీఎం అపాయింట్మెంట్ కోసం వెళ్ళాలని భావిస్తే అరెస్టులు చేయించారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. ఆయన బయట తిరగడు. బయట పరిస్థితులు ఆయనకు వివరిస్తామంటే కలవడని దుయ్యబట్టారు. ప్రజల చేతిలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సంస్కారంగా ఉండాలని, చిల్లర మల్లర రాజకీయాలు మంచిది కాదని,
ప్రజల గుండెల్లో మేము ఉంటాం..వాళ్ళ గురించి మేము పట్టించుకుంటామని తెలిపారు. మంత్రి కమలాకర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకు చివరకు దానికే పరిమితమవుతావని అన్నారు. అహంకారం మంచిది కాదని, ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని, నీ ఎమ్మెల్యే సీటుకు ఎసరొచ్చింది. దానిని కాపాడుకో అంటూ పేర్కొన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలకు స్వస్తి పలకాలని, అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తామని సంజయ్ తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *