JMS News Today

For Complete News

అక్కడ అది అవసరం…నిధులివ్వండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 13: కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని లెవల్ క్రాసింగ్ (ఎల్సీ నెం.18) వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనుల ప్రారంభానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రైల్వేశాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దాదారావు దన్వేను కోరారు. రైల్వే శాఖ సహాయ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రావుసాహెబ్ దాదారావు దన్వేను బండి సంజయ్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతున్న విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. పనులు ప్రారంభం కాకపోవడవల్ల వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా హసన్ పర్తి – కరీంనగర్ రైల్వే లైన్ నిర్మాణం పనుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు నిత్యం కరీంనగర్–హసన్ పర్తి మీదుగా ప్రయాణాలు సాగిస్తుంటారని వివరించారు. త్వరగా హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే నిర్మాణ పనులను పూర్తి చేయడంవల్ల ఈ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి రావుసాహెబ్ దాదారావు దన్వే తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంజయ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.