సంజయ్ కి ఊరట…బయటకొచ్చే చాన్స్…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జనవరి 5: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ ను విడుదల చేయాలని హైకోర్టు జైళ్ళ శాఖ డీజీని ఆదేశించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని ఆయనను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జైలులో 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. బండి సంజయ్ రిమాండ్ రిపోర్టును హైకోర్టు కొట్టేసింది. 40వేల బాండ్ సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరైన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో సంజయ్ బయటకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకవేళ ఇన్ టైమ్ లో జైలు అధికారులకు బెయిల్ పేపర్లు అందజేయకపోతే గురువారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.