జైలు నుంచి సంజయ్ విడుదల….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జనవరి 5: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని ఆయనను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ జైలులో 14 రోజుల రిమాండ్ లో ఉన్న బండి సంజయ్ రిమాండ్ రిపోర్టును హైకోర్టు కొట్టివేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించడంతో కొద్ది సేపటి క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి కేంద్ర మంత్రి భగవత్ కుబాతో కలిసి బయటకు వచ్చిన సంజయ్ కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ జివో 317 సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జివో సవరిస్తే సంతోషిస్తానన్న సంజయ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకు వెళ్లానని, జివో సవరించకపోతే మరోసారి జైలుకు పోవడానికి సిద్దమేనన్నారు. నన్ను అరెస్ట్ చేసి ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని, రాష్ట్రంలో బిజెపి ఆధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.