JMS News Today

For Complete News

బల్దియాకు బండి అభినందనలు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 21: పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత విధానాలతో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరాలు, పట్టణాల్లో మెరుగైన నివాస యోగ్య పరిస్థితుల్ని కల్పించాల్సిన అవసరముందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల విభాగంలో కరీంనగర్ కు దేశవ్యాప్తంగా 72వ, రాష్ట్రంలో 1వ ర్యాంకు రావడం సంతోషకరమని తెలిపారు. 50 వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన పట్టణాల ర్యాంకుల్లో సిరిసిల్లకు 16వ స్థానం, 25 వేల నుంచి 50 వేలలోపు జనాభా కలిగిన సౌత్ జోన్ పట్టణాల జాబితాలో వేములవాడ నాలుగో స్థానం దక్కించుకోవడంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *