JMS News Today

For Complete News

వాటి నిగ్గు తేల్చండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మే 22: కరీంనగర్ నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించడంతోపాటు,
ఎల్.ఆర్.ఎస్ పెండింగ్ బిల్లుల కమిషన్ల పై నిగ్గు తేల్చాలని బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె శశాంక ను కలిసి ఈ విషయంపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నగర పాలక సంస్థలో ఎల్.ఆర్.ఎస్ పనుల పెండింగ్ బిల్లుల కొరకు కాంట్రాక్టర్ వద్ద నుండి 1% శాతం అనగా రూ. 50,000 లు వసూలు చేయడం, దీనికి సంబంధించిన మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ. 50,000 లు గూగుల్ పే ద్వారా ట్రాన్సఫర్ అయినట్టు ఆ వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టి సోషల్ మీడియా లో వైరల్ అయిందని అన్నారు. ఈ వాట్సాప్ మెసేజ్ లో రూ. 50,000 లు నా దగ్గర తీసుకున్నారని, ఇప్పటివరకు ఎందుకు పేమెంట్ ఇవ్వడం లేదని, అలాగే మా దగ్గర ఎందుకు డబ్బులు వసూలు చేసారో చెప్పగలరు? అని సదరు కాంట్రాక్టర్ ప్రశ్నించడం జరిగిందని, దీనికి సంబంధించిన గూగుల్ పేమెంట్ ద్వారా చేసిన లావాదేవీల వివరాలు సదరు కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ వివరాలు కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంతో ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. దీనితో చాలా మంది కాంట్రాక్టర్స్ దగ్గర పెండింగ్ బిల్లుల కోసం డబ్బులు తీసుకున్నారని అనడానికి కాంట్రాక్టర్ పెట్టిన మెసేజ్ నిదర్శనమని, ఈ విషయంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నట్లు స్పష్టం అవుతున్నదని తెలిపారు. అలాగే నగర పాలక సంస్థ లో చేస్తున్న ప్రతి పనికి ఒక రేట్ ను నిర్ణయిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తున్నదని, ఇంత పెద్ద అవినీతి అక్రమాలు నగర పాలక సంస్థ లో బయటపడిందంటే దీని వెనుకాల ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ విషయం పై అవినీతి నిరోధక శాఖ తో సమగ్ర విచారణ జరిపి, ఏ స్థాయి ప్రజాప్రతినిధులు అయినా, ఏ స్థాయి అధికారులు అయినా వదిలిపెట్టకుండా తగిన చర్యలు తీసుకొని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని వినతి పత్రంలో జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే దీని ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శికి, మున్సిపల్ శాఖ మంత్రికి కూడా పంపడం జరిగిందని మహేందర్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *