JMS News Today

For Complete News

నరాలు తేగే ఉత్కంఠ…చివరకు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

దుబ్బాక, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏ ఎన్నికలు జరిగిన ఓటమెరుగని అధికార తెరాసకు దుబ్బాక ఓటర్లు షాక్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటుకే పరితమైన బిజెపికి దుబ్బాక ప్రజలు అండగా నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుకుని బిజెపి చరిత్ర సృష్టించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జయకేతనం ఎగురవేశారు. నరాలు తేగేంత ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్ లో చివరి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడంతో బీజేపీ విజయడంకా మోగించింది. 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూసిన రఘునందన్ రావు మూడో ప్రయత్నంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, దుబ్బాక గెలుపుతో హైదరాబాద్ లోని బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మొత్తానికి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి ఉప ఎన్నికల్లో అధికార తెరాసకు ఓటమి రుచి చూపించిన బండి సంజయ్ కుమార్ కి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *