ఆయన తక్షణమే గద్దె దిగాలి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 7: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే కనీసం రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కానీ, కరోనా వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్న కేంద్రాలను పరిశీలించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసిఆర్ గద్దె దిగాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయిన్ పల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గత కొంత కాలంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కడున్నారని, కనబడుట లేదని పత్రికలలో ఇతర ప్రసార సాధనాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి వారు స్పష్టత ఇవ్వాాల్సిందిపోయి అడుగుతున్న వారిపైన ఎదురుదాడి చేయడమే కాకుండా కాలయాపన చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలో విజృంభిస్తున్నటువంటి కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించడం కోసం ప్రభుత్వ ఉన్నత అధికారులను పిలవగా, వారిని సమావేశానికి పోకుండా అడ్డుకొని అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వాధినేత కెసిఆర్ ఇప్పటికైనా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికిప్పుడు అత్యవసరం లేనటువంటి సెక్రటేరియట్ ను అర్ధరాత్రి కూల్చడం ప్రారంభించి అర్ధరాత్రి ఒక కొత్త డిజైన్ రూపొందించడం బాధాకరమని, రాష్ట్రంలో ప్రజలు దిక్కుతోచని విధంగా భయబ్రాంతులకు గురై కరోనా బారిన పడి చనిపోతూ ఉంటే శ్రద్ధ చూపాల్సింది పోయి నిర్లక్ష్యం చేేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా కరోనా టెస్టులకు నిధులు కేటాయించకుండా టిఆర్ఎస్ పాలకులకు, నాయకులకు కాంట్రాక్టర్ల ద్వారా లాభం వచ్చేటువంటి సెక్రటేరియట్ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ కరోనా చికిత్స, బాధితులపై లేకపోవడం దురదృష్ట కరమని ప్రవీణ్ పేర్కొన్నారు. .