యువకుడి రక్తదానం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 12: కరీంనగర్ శివారు బొమ్మకల్లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి శస్త్ర చికిత్స నిర్వహించగా, వైద్యులు రోగికి రక్తం కావాలని సూచించడంతో జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీ నివసిస్తున్న చందు అనే యువకుడు రక్తదానం చేసి ఆదుకున్నాడు. కాగా, రక్తదానం చేసిన యువకునికి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.