ఏసీబీకి చిక్కిన బొల్లారం ఎస్ఐ
1 min read
హైదరాబాద్ : ఓ క్రిమినల్ కేసులో నిందితుడిని తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తిని క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకుగాను బొల్లారం ఎస్ఐ బ్రహ్మచారి డబ్బు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఆ డబ్బును ఏర్పాటు చేశాడు. అయితే, అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎస్ఐ బ్రహ్మచారి రూ.20 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఐతో పాటు, కానిస్టేబుల్ నగేష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.