తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. హత్య
1 min read
హన్మకొండ: హన్మకొండలో ఓ ఉన్మాది దారుణ ఘాతుకానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించి… హత్య చేసాడు. ఈ దారుణ ఘటన బుధవారం కలకలం రేపింది. దాబాపై నిద్రిస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిన ప్రవీణ్ అనే ఉన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈలోగా పాపా తలిదండ్రులు లేచి చూడగా, పాప కనిపించకపోవడంతో కంగారు పడి చుట్టు పక్కల చూస్తుండగా, ఉన్మాది చేతిలో పాపను చూసి ఆందోళనకు గురయ్యారు. అక్కడికి చేరుకోగా, పాప అప్పటికే అస్వస్తతకు గురి కాగా, వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఉన్మాది ప్రవీణ్ ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.