JMS News Today

For Complete News

బిఎస్ఎన్ఎల్ లో ఆధార్ సేవలు షురూ….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 31: కరీంనగర్ నగరంలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఆఫీస్ కార్యాలయంలో రెండవ ఆధార్ సేవా కేంద్రాన్ని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సుభాష్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునే వారు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలని కరీంనగర్ ప్రజలకు సూచించారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేయనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డు లో మార్పులకు 50 రూపాయలు రుసుము తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కోరుట్ల, మెట్ పల్లి, హుజురాబాద్, గోదావరిఖని, హుస్నాబాద్, మంథనిలలో ఆధార్ సేవా కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *