బీటెక్ విద్యార్థి ఆత్మహత్య…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
వరంగల్, ఆగస్టు 7: వరంగల్ ఎన్ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో క్యాంపస్ లో కలకలం రేపింది. బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కౌశిక్ పాండే (20) అనే విద్యార్థి వసతి గృహంలోని తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటి విద్యార్థి మృతి చెందడంతో ఎన్ఐటీ లో విషాద ఛాయలు అలముకున్నాయి. కౌశిక్ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.