ప్రగతి భవన్ లో మంత్రివర్గం సమావేశం
1 min read
హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రధానంగా కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కార్పోరేషన్లు, పుర పాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో సమాప్తం కానుంది. ఈ ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.