ఆ మంత్రి హామీ ఇచ్చారు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 4: కరీంనగర్ కు అత్యధిక నిధుల మంజూరుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హామీ ఇచ్చినట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. నెల రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో సమావేశమయ్యారు అదే సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్లో వివిధ ప్రభుత్వ శాఖలకు భారీ నిధులు కేటాయించనుండగా, అందులో కేటాయించిన నిధులలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పరిధిలో అధికంగా నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు బండి చెెప్పారు. కొత్తపల్లి -మనోహర బాద్ రైల్వేల పనులు, కొత్త రైల్వే మార్గాలకు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారని, అదేవిధంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు అత్యధిక నిధులు మంజూరు చేసేందుకు ప్రాముఖ్యతను ఇస్తామని కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు స్పష్టమైన హామీకి ఇచ్చినట్లు ఎంపీ సంజయ తెలిపారు.