టాప్ 20లో మన పోలీసు స్టేషన్ లు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 26: 2018 సంవత్సరానికి గాను దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ నుంచి రెండు పోలీస్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పోలీస్ స్టేషన్లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ పోలీస్ స్టేషన్‌కు ఒకటవ ర్యాంక్ దక్కింది. తెలంగాణ నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు 14వ ర్యాంకు దక్కగా.. నల్గొండ పరిధిలోని చింతలపల్లి పోలీస్ స్టేషన్‌కు 24వ ర్యాంకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయ నగరంలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌కు 20వ ర్యాంకు, అదే జిల్లాలోని పార్వతిపురం పోలీస్ స్టేషన్‌కు 25వ ర్యాంకు, బుదరాయవలస పోలీస్ స్టేషన్‌కు 30వ ర్యాంకు దక్కాయి. గుంటూరులోని సందోల్ పోలీస్ స్టేషన్‌కు 21వ ర్యాంకు దక్కాయి. అనంతపురంలోని పుత్లూరు పోలీస్ స్టేషన్‌కు 23 ర్యాంకు దక్కింది. టాప్-20 పోలీస్ స్టేషన్లలో తెలుగు రాష్ట్రాల నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు మాత్రమే చోటు దక్కడం గమనార్హం.