మోడీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 5: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆర్టికల్ 35ఎ, 370 రద్దు చేస్తూ రాజ్యసభలో సోమవారం బిల్లు అమిత్ షా ప్రవేశపెట్టగా, వెంటనే ఆమోదిస్తూ రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. ఆ వెంటనే గెజిట్ కూడా విడుదల చేశారు. ఒక దాని వెనుక ఒకటి చకాచకా జరిగిపోయాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయింది. ఢిల్లీ తరహాలోనే జమ్మూ కాశ్మీర్ కాగా, పార్లమెంటులో చేసిన ప్రతి చట్టం జమ్ము కాశ్మీర్ లో నడుస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలుగా ఢిల్లీ తరహాలోనే జమ్మూ కాశ్మీర్, లడక్ కొనసాగనున్నాయి. కేంద్ర సర్కారు నిర్ణయం తో రాజ్య సభ దద్దరిల్లింది. రాజ్య సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయగా, పీడీపీ ఎంపీలు చొక్కాలు చింపుకుని నిరసన తెలపగా, రాజ్యసభ నుండి పీడీపీ ఎంపీలను మార్షల్స్ బయటకు తీసుకెళ్ళారు. మొత్తానికి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ పై ప్రశంసలు వర్షం కురుస్తోంది.