ఎమ్మెల్యేకు కేంద్ర హోంశాఖ నోటీసులు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎమ్మెల్యే రమేశ్ తోపాటు, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ లకు కేంద్రం నోటీసులు పంపింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ ఆ ఇద్దరికీ స్పష్టం చేసింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగివున్నారంటూ ఆది శ్రీనివాస్ గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం కూడా ఉంది. ఇప్పుడు దీనిపైనే హోంశాఖ నోటీసులు పంపింది. ఈ క్రమంలో చెన్నమనేని రమేశ్ అక్టోబరు 31న కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి తన వివరణ తెలియజేయనున్నారు.