మంత్రి పర్యటన లో ఉద్రిక్తత
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 21: పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. కిషన్‌రెడ్డి ఆదివారం ఆసిఫ్‌నగర్‌లో పర్యటిస్తున్న సమయంలో.. ఓ యువకుడు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టాడు. దీంతో పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్‌రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడిని పట్టుకొని బీజేపీ శ్రేణులు చితకబాదారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.