కేంద్ర మంత్రి ని కలిసిన రెడ్డి ఐక్య వేదిక
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 21: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ని ఆదివారం హైదరాబాద్ లో రెడ్డి ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ ను తెలంగాణలో అమలు చేయాలని, అలాగే నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది. తిరుపతి రెడ్డి, అడ్వైజర్ సామ.బాల్ రెడ్డి, వంచ.గోవర్ధన్ రెడ్డి, గుర్రం పాపిరెడ్డి, వెంకట్ రెడ్డి, శరాన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దోనపాటి అనంత్ రెడ్డి, ధనేకుల భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మనోజ్ రెడ్డి ,సన్నీ, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి బాంధవులు పాల్గొన్నారు