JMS News Today

For Complete News

మనోళ్ళు క్షేమంగా వచ్చేలా చర్యలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

న్యూ ఢిల్లీ, ఆగస్టు 3: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో విద్యనభ్యసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్ లతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులతో విద్యార్థులు క్షేమంగా పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లో ఉన్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులు, రైల్వే విమానయాన శాఖ అధికారులతో ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బలగాల రక్షణలో ముందుగా జమ్మూ పట్టణానికి తరలిస్తున్నారు. అక్కడి నుండి ప్రత్యేక రైళ్లతో పాటు, వివిధ రవాణా మార్గాల ద్వారా సురక్షితంగా విద్యార్థుల గమ్యస్థానాలకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు రైల్వే మంత్రి తో, వివిధ శాఖ అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంప్రదింపులు జరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులను కూడా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల కు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బండి సంజయ్, సోయం బాపురావు లు ప్రతీ క్షణం కిషన్ రెడ్డికి సహాయకంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్య పడవద్దని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *