JMS News Today

For Complete News

కౌంట్ డౌన్ షురూ.. ఇక ఎగరడమే తరువాయి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

శ్రీహరికోట, జూలై 14: చంద్రుని మీద నీటి జాడలను చంద్రయాన్‌-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో..మరింత సమాచారం కోసం సుమారు రూ.1000కోట్లతో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ మేరకు చంద్రయాన్-2 మిషన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రారంభం గల ఈ మిషన్ కి సంబంధించి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై రోబోటిక్ రోవర్ ని అడుగు పెట్టించాలన్నది మన ధ్యేయం. ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ ‘ జీఎస్ఎల్వీ ..ఎంకే.-3 ‘ ని చంద్రునిపైకి ప్రయోగిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని మొత్తం కాల వ్యవధి ఏడాదిపాటని వారు పేర్కొన్నారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి దాదాపు రెండు నెలల అనంతరం ఈ రాకెట్ లాంచర్ చంద్రుని సౌత్ పోల్ సమీపంలో దిగుతుందని వారు వివరించారు. 640 టన్నుల రాకెట్ లాంచర్ అయిన దీన్ని ‘ బాహుబలి ‘గా అభివర్ణిస్తున్నారు. 15 అంతస్థుల బిల్డింగ్ అంతటి పొడవైన ఈ లాంచర్.. 3.8 టన్నుల బరువైన ఉపగ్రహాన్ని చంద్రునిపైకి మోసుకుపోతుంది. భారత దేశం ప్రయోగిస్తున్న అతి బరువైన లాంచర్లలో ఇది మూడవది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిలకించనున్నారు. స్పేస్ పోర్ట్ నుంచి లైవ్ లాంచ్ ని చూసే మూడవ రాష్ట్రపతి కానున్నారు ఆయన. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపైకి రోవర్‌ను పంపి సమాచారాన్ని సేకరించిన నాలుగో దేశంగా భారత్‌కు గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్‌లను పంపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *