JMS News Today

For Complete News

జాబిల్లికీ చేరువలో….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం సక్సెస్ అయ్యింది. సోమవారం ఆర్బిటర్ నుంచి విడివడిన విక్రమ్‌ (ల్యాండర్) ప్రజ్ఞాన్ (రోవర్) జాబిల్లి వైపు తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. ఇప్పటివరకూ చంద్రయాన్-2 పూర్తి చేసుకున్న దశలన్నింటిలోకి ఇదే అత్యంత ప్రధానమైనదనీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. జులై 22న చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్బిటర్..ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం దాని కక్ష్యను ఐదు సార్లు తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆర్బిటర్‌ను చంద్రుడికి మరింత దగ్గరగా తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఈ మొత్తం ప్రక్రియలోని కీలక ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది. ఆర్బిటర్ నుంచి విడివడిన ల్యాండర్, రోవర్‌లు జాబిల్లి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించాయి. రాబోయే రోజుల్లో ల్యాండర్ క్రమంగా జాబిల్లికి మరింత దగ్గర కానుంది. సెప్టెంబర్ 7న మొత్తం చంద్రయాన్-2 ప్రయోగంలోనే అత్యంత కీలక ఘట్టం మొదలుకానుంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న విక్రమ్..దాదాపు 15 నిమిషాల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది. ఈ 15 నిమిషాలనే అత్యంత ఉత్కంఠతను కలిగించేవిగా ఇస్రో అభివర్ణించిందంటే ఈ ఫీట్ ఎంత సంక్లిష్టమైనదో అర్థం చేసుకువచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *