రేపటి నుంచి ధార్మిక కార్యక్రమాలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, డిసెంబర్ 1: అందరిలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ జానంపేట మారుతీ స్వామి, సర్పంచ్ కోల రమేష్, ఎంపిటిసి వంచ మహేందర్ రెడ్డి, హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి గోపి బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి గోపి బాబు మాట్లాడుతూ సోమవారం నుంచి ఆరు రోజుల పాటు అన్నమయ్య సంకీర్తనలు, భక్తి భావం పెంపొందించే ఉపన్యాసాలు, కుంకుమ పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సర్పంచ్ కోల రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మొదటిసారిగా టిటిడి ఆధ్వర్యంలో సోమవారం నుంచి జరిగే ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలు, మహిళలు, భక్త మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక ప్రచార కార్యదర్శి నరెడ్ల సదయ్య, ఆలయ పూజారి రాము, ఆలయ కమిటీ సభ్యులు మురళీ, భూపతి, రాజేశం, రమేష్, భక్తులు మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, కనకయ్య, మిత్ర తదితరులు పాల్గొన్నారు.