చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం భేటీ
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 4: కరీంనగర్ ప్రెస్ భవన్ లో చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘం స్థల సాధన కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బంధువులు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం జిల్లా శాఖ కు ఇచ్చిన హామీ మేరకు ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం నిర్ణయించింది. మరో సమావేశాన్ని నిర్వహించి, సాధన కమిటీ వేయడంతో పాటు ఎమ్మెల్యే గారిని కలవాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జానంపేట మారుతీ స్వామి, కార్యదర్శి తిరునగిరి రవీందర్, చెన్నోజ్వల మనోహర స్వామి, జగన్నాధం శ్రీనివాస స్వామి (పేపర్ శీనన్న), తిరునహరి గోపాల స్వామీ, సుదర్శనం మనోహర స్వామి, జె.వి.శ్రీనివాస్, తిరుకోవేళ వెంకట రమణ, మధుసూదన స్వామి, శ్రీభాష్యం వెంకటరమణ, తిరునగరి వెంకటేశ్వర స్వామి, తాడూరి కరుణాకర్, సింహాచలం రవీందర్, జానంపేట సత్యనారాయణ, వెంకటస్వామి, లొంకల శ్రీనివాస్, రఘులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనస్పర్ధలతో విడిపోయిన భార్యభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారి సమస్యను పరిష్కరించి, వారిని ఏకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.