జనాలకు కుచ్చుటోపి…తర్వాత కటకటాల్లోకీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 23: చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో రెండు కోట్ల రూపాయల వరకు జనాలకు కుచ్చు టోపి పెట్టిన ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కరీంనగర్ లోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ ప్రజలను కోట్లాది రూపాయలు మోసం చేసిన బచ్చు కుమారస్వామి అనే నిందితుడిని టాస్క్ ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ లోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న కుమారస్వామి ఆర్టీసీ మంథని డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ ఊద్యోగం చేస్తూనే చిట్టీలు, ఫైనాన్స్ దందా చేయడంతో ఆర్టీసీ అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అయినా, అతని ప్రవర్తన మార్చుకోకుండా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. ప్రజలతో సన్నిహితంగా ఉంటు వారితో చిట్టీలు కటిస్తూ తన యొక్క దందాను క్రమక్రమంగా పెంచుకుంటూ ముందుకుసాగాడు. ప్రజల వద్ద నుండి చిట్టీల పేరుతో నెలకు యాభై వేల నుండి ఇరవై లక్షల వరకు చిట్టిలను నిర్వహించాడు. చిట్టి అయిపోయిన తర్వాత కూడా వారికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా ఆ డబ్బులను తన సొంతానికి వాడుకోవడం మొదలైంది. ప్రజల వద్ద నుండి అప్పుగా తీసుకున్న డబ్బులను కూడా తిరిగి చెల్లించకుండా వారికి మాయ మాటలు చెప్తూ ఉండేవాడు. 2019 జూలై 14న ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో బాధితులందరు కరీంనగర్ పోలీసు కమీషనర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులు దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎసీపీ శోభన్ కుమార్, సిఐలు శ్రీనివాస రావు, జనార్ధన్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ విజయ్ కుమార్, ఎస్ఐ నరేష్ కుమార్, ఏఎస్సై నరసయ్య, టాస్క్ ఫోర్స్, పోలీసు స్టేషన్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.