JMS News Today

For Complete News

సెల్లేమ్మె భూతం షార్ట్ ఫిల్మ్ విడుదల

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 2: అను క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ దర్శకత్వంలో సీనియర్ జర్నలిస్ట్ జానంపేట మారుతి స్వామి నిర్మించిన ” సెల్లమ్మే భూతం” అనే లఘు చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ సోమవారం నాడు కరీంనగర్ ప్రెస్ భవన్ లో రిలీజ్ చేశారు. సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన మారుతి స్వామిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో లఘు చిత్రం ఎడిటర్ రాము మొగిలోజి, మేకప్ మెన్ అశోక్ శ్రీరామోజు, నటులు గద్దె ఉదయ్ కుమార్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహ రావు , ఈద మధుకర్ రెడ్డి , కోశాధికారి తాండ్ర శరత్ రావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగోజు మహేందర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్తెనపల్లి కుమార్ అక్కినపల్లి కుమార్, సీనియర్ జర్నలిస్టులు కొయ్యడ చంద్రశేఖర్ , వెంకటేశ్వర స్వామి, యాకయ్య,రాజయ్య హరికృష్ణ , రాధాకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో గుండ మల్లయ్య, మారుతి స్వామి, కిషోర్ దూలూరు, ప్రియ, సీతామాలక్ష్మి ,కిషన్ నునుగొండ , ఉదయ్ కుమార్, నరేష్ కట్కూరి ,రంజిత్ వేముల , అనిత, రమేష్ రావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా :కిషన్ నునుగొండ , మేకప్ : అశోక్ శ్రీరామోజు , ఎడిటింగ్: రాము మొగిలోజి, అసిస్టెంట్ కెమెరామెన్: రంజిత్ వేముల, నిర్మాత: జానంపేట మారుతి స్వామి, కథ ,మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం :అయిలు రమేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *