రాత్రికి రాక…రేపు పర్యటన…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 26: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కరీంనగర్ నగరంలో పర్యటించనున్నారు. నగరానికి చెందిన కార్మిక నాయకుడు రూప్ సింగ్ కూతురు వివాహానికి హాజరవుతారు. అనంతరం కలెక్టరేట్ లో దళిత బంధుపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళతారు. గురువారం సాయంత్రం వరంగల్ చేరుకుని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి హాజరవుతారు. అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడ బస చేస్తారు. సీఎం పర్యటనతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టనుంది.