ఆ తహశీల్దార్ సస్పెండ్…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 8: భూ రికార్డుల ప్రక్షాళన లో నిర్లక్ష్యం వహించిన చిగురుమామిడి తహశీల్దార్ కె. శ్యాంసుందర్ ను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చిగురుమామిడి మండలం లో భూ రికార్డుల ప్రక్షాళన పై శ్యామ్ సుందర్ తప్పుడు నివేదికలు అందించారని, ఇందుకుగాను సస్పెన్షన్ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యూటీ తహశీల్దార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతంగా చేయకపోవడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పలుమార్లు తహశీల్దార్ శ్యాంసుందర్ ను హెచ్చరించారు. అయినా. తహశీల్దార్ తీరులో మార్పు రాకపోవడంతో జేసీ సస్పెన్షన్కు సిఫార్సు చేయగా, కలెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.