పోలీసుల అదుపులో శివాజీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 3: సినీ నటుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివాజీని సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విదేశాలకు వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నా నేపథ్యంలో పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. టీవీ9 యాజమాన్యం బదలాయింపు విషయంలో మాజీ సీఈఓ రవి ప్రకాష్ తో పాటు శివాజీని విచారించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులను కూడా జారీ చేశారు. అయినా, శివాజీ పట్టించుకోకుండా విచారణకు హాజరు కాకపోవడం తో పోలీసులు శంషాబాద్ లో వెయిట్ చేస్తున్న శివాజీ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న విచారణ కు హాజరు కావాలని శివాజీ కి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.