అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు…
1 min read
(జె ఎం ఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 28: ప్రముఖ సినీ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. చిలుకూరు సమీపంలోని విజయకృష్ణ గార్డెన్స్ లో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె కుమారుడు నరేశ్ ఆమెకు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకు ముందు నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెను కడసారి చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆమె అంత్యక్రియలు ముగిశాయి.