రేపు ఆమె అంత్యక్రియలు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 27:
ప్రముఖ సినీ నటి, నిర్మాత, దర్శకురాలు ఘట్టమనేని విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20న జనించిన ఆమె చిన్న (7) తనంలోనే సీనీరంగంలోకీ ప్రవేశం చేశారు. ఆమె ప్రముఖ నటుడు కృష్ణ ను వివాహమాడారు. నటుడు నరేష్ ఆమె కుమారుడు. కృష్ణ తో కలిసి ఆమె సుమారు 47 చిత్రాలలో నటించారు. 44 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఆమె సుమారు 200 పైగా తెలుగు, తమిళ, మళయాళ భాషలలో నటించారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలు ఆమె. 2018లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అందుకున్నారు. ఆమె మరణం సీనీరంగానికి తీరని లోటని చెప్పవచ్చు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువులు సందర్శనార్థం ఇంట్లోనే ఆమె భౌతిక దేహాన్ని ఉంచి, శుక్రవారం ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ కి తరలించనున్నారు. అనంతరం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, విజయ నిర్మల మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆమె మృతి సీనీరంగానికి తీరని లోటని పేర్కొన్నారు.