సింగ్ ఎం చేశారో తెలుసా…
1 min read
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యకర్తల సమావేశంలో కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ మరో ప్రశంస దక్కింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శభాష్ మేయర్ అంటూ ప్రశంసించారు. బుదవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ ముఖ్యమంత్రి కేసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశ సంధర్బంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రసంగిస్తూ… కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన మానవీయ పథకం అయిన 1 రూ. అంతిమ యాత్ర ఆఖిరి సఫర్ కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో అవసరమై పథకం అన్నారు. శభాష్ మేయర్ అంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రశంసిస్తూ నగర మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ ను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు పేద ప్రజలను ఉద్దేశించి ప్రవేశ పెట్టిన పధకాలని తెలిపారు. కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ తల పెట్టిన ఆలోచన చాలా మంచి అలోచన అని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎడ్ల అశోక్, పెండ్యాల మహేష్ లు పాల్గొన్నారు.