కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 12: కాళేశ్వరం పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా ఉత్తర తెలంగాణ భవన్ గా పిలువబడే తీగలగుట్టలపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి, గురువారం ఉదయం ఇక్కడి నుంచి కాళేశ్వరంకు వెళ్లి కాళేశ్వర-ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ ని పరిశీలించనున్నారు. కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు కలెక్టర్ కె శశాంక, ఇన్ఛార్జి సీపీ సత్యనారాయణ, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు ఉన్నారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.