సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు చిత్రాలను చెక్కడాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తెలంగాణ చౌక్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీహరి, భజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్, కారు గుర్తు, కెసిఆర్ కిట్, ప్రభుత్వ పథకాలను చెక్కడం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. యావత్ హిందూ సమాజాన్ని అవమాన పరిచారని, లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దేవుని కంటే కేసీఆర్ పాలననే కనిపించేలా ఉందని విమర్శించారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని టిఆర్ఎస్ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తే హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా వాటిని తొలగించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు పాత కాశీనాథం, తోట రాజేందర్, గుజ్జెటి రాజేందర్, మహేష్, వెంకటేష్, సాయితేజ్, వినయ్ సాగర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.