సీఎం కేసీఆర్ సభ రద్దు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 17: భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ పాల్గొనే హుజూర్ నగర్ ఉప ఎన్నికల టీఆర్ఎస్ బహిరంగ సభ రద్దయ్యింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచన మేరకు కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. సభ రద్దు కావడంతో అప్పటి వరకు జోష్ లో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు నిరాశ కలిగించింది.