సీఎం భేటీపై ఆసక్తి, ఉత్కంఠ…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 6: సీఎం కేసీఆర్ ఇచ్చిన ఛాన్స్ ను ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం పట్టించుకోకపోగా, అదే పట్టింపు ధోరణితో వ్యవహరించారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన గడువు నిన్న అర్థరాత్రే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 375 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సమ్మె నేపథ్యంలో చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలు, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ఆ కీలక నిర్ణయం ఏలా ఉండబోతోందనేది తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.