JMS News Today

For Complete News

యదాతథం…నో చేంజ్…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఏప్రిల్ 19:  తెలంగాణ లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకు లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అలానే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న గైడ్ లైన్సే అమల్లో ఉంటాయని తెలిపారు. కేబినేట్ సమావేశం అనంతరం ఆదివారం రాత్రిసీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ మాట్లాడుతూ పత్రికలు చేసిన సర్వే ల్లో కూడ లాక్ డౌన్ లో ఎలాంటి సడలింపులు వద్దని ప్రజల్లో విస్తృత చర్చ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 858 నమోదు కాగా, ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదు అయ్యాయని, 21 మంది మృతి చెందారని వివరించారు. ప్రస్తుతం 651 చికిత్స పొందుతున్నారని, 186 మంది డిచ్చార్జ్ అయ్యారని చెప్పారు. వరంగల్ రూరల్, సిద్దిపేట, వనపర్హి, యాదాద్రి ఈ నాలుగు జిల్లాల్లో వైరస్ లేదని అన్నారు. కoటేన్మెంట్ ఏరియాల్లో సీరియస్ తీసుకోవాలని, పోలీసులు రూల్స్ కచ్చితంగా పాటించాలని తెలిపారు. 7 వరకు విమానాలు, విదేశీ ప్రయాణాలు ఉండవు, ఎవరు రావద్దని సూచించారు. పండుగలు, ప్రార్థనలు రంజాన్ సహా అన్ని ఇంట్లోనే జరుపుకోవాలని, బయట అనుమతి లేదని స్పష్టం చేశారు. ఫుడ్ డోర్ డెలివరీ లేదని, వాటిపైై నిషేధం విధించినట్లు తెలిపారు. పేదలను ఆదుకోవడంలో అందరు పనిచేస్తున్నారని, ఒక్కరు కూడా తెలంగాణ లో ఉపవాసం ఉండవద్దని కోరారు. ఏ ఆపద వచ్చిన 100 కు పోన్ చేయాలని అన్నారు. ఉద్యోగులకు గత నెలలో ఇచ్చిన జీతాలు ఇవ్వడం జరుగుతుందని, పెన్షన్ దారులకు 75 శాతం జీతం ఇస్తామని ప్రకటించారు. పోలీసు సిబ్బందికి ఈ నెల జీతంతో పాటు 10 శాతం అదనంగా ఇస్తామని, విద్యుత్ ఉద్యోగులకు 100 శాతం జీతాలు ఇస్తామని చెప్పారు. కిరాయిదారులు మార్చి, ఏప్రిల్, మే అద్దె వసూళ్లు చేయవద్దని, చేస్తే కేసులు నమోదు చేస్తామని, ఇది ప్రభుత్వ ఆదేశమని అన్నారు.  నెల వారిగా ట్యూషన్ పిజులు మాత్రమే ప్రైవేటు పాఠశాలలు తీసుకోవాలని, పిజులు పెంచవద్దని సూచించారు. మే నెలలో కూడ 12 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని, రూ.1500 కూడ బ్యాంక్ లో జమ చేస్తామని, ప్రభుత్వం బ్యాంక్ ల్లో వేసిన డబ్బు వాపస్ పోతుందనేది అబద్ధమని తెలిపారు. ఆసరా పింఛన్లు యధావిధిగా వేయడం జరుగుతుందని చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంను వైద్య శాఖ కు కేటాయింపు జరిగిందని,  750 బెడ్స్ తో కార్పొరేట్ ఆసుపత్రి గా మార్పు చేేేయడం జరిగిందని తెలిపారు. మే 5 న మరోసారి కేబినేట్ సమావేశం ఉంటుందని,  వలస కూలీలకు 12 కేజి ల బియ్యం, రూ 1500 ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వమే అన్ని గింజలను మద్దతు ధరకు కొనుగోళ్ళు చేస్తదని, తక్కువ ధరలకు రైతులు అమ్ముకోవద్దని  కోరారు. కాళేశ్వరం జలాలు అన్ని ప్రాంతాలకు కొద్దీ రోజుల్లోనే చేరుకుంటాయని, ఈ రోజు వరకు సిద్దిపేటకు చేరుకున్నాయనిి, ఈ వర్షకాలంలో కోటి 35 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని తెలిపారు. రైతులు ఇప్పటి నుండే ఎరువులు తీసుకోవాలని సూచించారు. మరో నెల వరకు పెళ్లిళ్లు, శుభ కార్యాలు నిషేధం ఉన్న నేపథ్యంలో కమ్యూనిటీ హాళ్లను ఈ నెల వరకు ఎరువుల గోదాంలు గా వాడుకోవాలని కలెక్టర్ లకు ఆర్డర్స్ ఇచ్చామని చెప్పారు. లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు కావాలని, రోడ్లపైకి రావద్దని, ప్రభుత్వం చేసే ప్రతి చర్య ప్రజల కోసమేనంటూ అన్నారు. అత్యవసరం ఉంటే 100 కు డయల్ చేయాలని, కరోనకు మందు లేదు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రధాని తో ఈరోజు కూడ మాట్లాడా! ఆర్థిక వ్యవస్థ పై రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని కోరారు. కేంద్ర నిర్ణయాలు కేంద్రం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారం మేం తీసుకుంటామని చెప్పారు.130 కోట్ల జనాభా ఉన్న దేశానికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *