చంద్రబాబు గతే ఆయనకు…..
1 min read
ఢిల్లీ: నరేంద్ర మోదీ ని ఫాసిస్టు ప్రధానమంత్రిగా అభివర్ణించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నైతిక ప్రజాస్వామ్య విలువలు లేవని, సమాఖ్య స్ఫూర్తి లోపించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ అసహనంతో ప్రధాని పట్ల, బిజెపి పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ కు చంద్రబాబు కు పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు. బుధవారం ఆయన పార్లమెంటు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రతిరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న మోది దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మరోసారి ప్రధాని పీఠం చేపట్టారని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన నిధులు, సంక్షేమ పథకాలు అందించిన ఘనత మోడీదేనని, ఎన్నికల ముందు అభివృద్ధి నిధులపై బిజెపి అధ్యక్షులు అమిత్ షా లెక్కలతో సహా వివరించి సవాలు విసిరితే ఆనాడు కెసిఆర్ తోక ముడిచాడని బండి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలను అరికట్టలేని ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుజరాత్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని ప్రపంచ పటంలో మోడల్ గా మార్చిన మోడీని విమర్శించే నైతిక అర్హత లేదని, థర్డ్ ఫ్రంట్ పేరుతో నాటకాలాడిన కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు ఒక జోకర్ లో ,బ్రోకర్ లా చూస్తున్నారని సంజయ్ విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ నరేంద్ర మోడీకి మద్దతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో అతి త్వరలో ప్రజా తిరుగుబాటు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని విమర్శించిన కేసీఆర్ హైదరాబాద్ కరీంనగర్ నల్గొండ లో జరిగిన తీవ్రవాద కార్యకలాపాలపై ఆయా సంఘటనల వెనుక హస్తాలపై ఎన్ఐఏ ఇచ్చిన ఆధారాలు కెసిఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు హైదరాబాదులో రోహింగ్యాలు విదేశీయుల గణన చేపట్టి దేశ రాజ్యాంగ నిబంధనల ప్రకారం బయటకు గంటి శాంతియుత వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు హోంమంత్రి కిషన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న బిజెపి ని చూసి భయభ్రాంతులకు గురై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో వ్యవహరిస్తున్నారని దీనిని ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.