JMS News Today

For Complete News

ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ నుండి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నదిని చూడటానికి కేసీఆర్  ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంప్ హౌజ్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంగళవారం ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్  ఈ పర్యటన ప్రారంభించనున్నారు. కాగా, కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *